ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కథలు > నేను పేదింటి పిల్లను కాను...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను పేదింటి పిల్లను కాను...
WD
"అమర్... నీతో నేను ఇలా చనువుగా తిరుగుతున్న విషయం మా వాళ్ళెవరో తెలుసుకుని మా నాన్నగారితో చెప్పినట్లున్నారు. మా నాన్నగారు ఫోన్లో నాకు చివాట్లు పెట్టారు. నువ్వు మీ తల్లిదండ్రులతో మాట్లాడి తొందరలో ముహూర్తాలు పెట్టించే ఏర్పాటు చూడు" అని చెప్పిన సుమిత్ర మాటల్ని విన్నాడో లేదో కాని సిగరెట్ మీద సిగరెట్ కాల్చేస్తూ తెగ ఆలోచించేస్తున్నాడు అమర్.

పెద్ద చదువుల నిమిత్తం సిటీకొచ్చి చదువుతున్న సుమిత్రకు ఇంటర్ యూనివర్శిటీ చెస్ పోటీలలో చెస్ ఛాంపియన్‌గా పరిచయమయ్యాడు అమర్. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అమర్ ఎంత చొరవ తీసుకున్నా అతన్నుంచాల్సిన హద్దుల్లో వుంచింది సుమిత్ర.

గొప్ప చదరంగపు ఆటగాడైన అమర్ జీవన చదరంగంలో సుమిత్రతో ఈ పెళ్ళి అనే అడ్డంకిని ఏవిధంగా తొలగించుకోవాలి? ఏ ఎత్తు వెయ్యాలి? ఎలా? ఎలా? ఎలా? అని నానారకాలుగా ఆలోచించసాగాడు. అతని ఆలోచనల్ని భంగపరుస్తూ...

అమర్ నేను నిన్ను ప్రశ్నించిన విషయమై నీకు చీమకుట్టినట్టయినా లేనట్టుంది. అవునులే ఎందుకుంటుంది? ఎంతైనా మగవాడివికదా? నిష్ఠూరం ధ్వనించిందామె గొంతులో. '' అబ్బే.. లేదు సుమి| .. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానంతే" తడబడుతూ చెప్పాడు.

"ఏంచెయ్యాలనుకుంటున్నావో నాతో చెప్పవచ్చుకదా?" ప్రస్తుతానికి నాకైతే ఏమీ అర్థంకావడం లేదు... కమాన్ వెళ్ళి మంచి ఐస్‌క్రీం తినొద్దాం అన్నాడు.

అలా ఆ రోజు ఐస్ క్రీమ్ ఇప్పించిన అమర్... ఆ తర్వాత కనిపించలేదు. అతని జాడ లేకుండా పోయింది. కాల చక్రం వేగంగా తిరిగింది... సుమిత్ర కంటికి అమర్ మాత్రం కనిపించలేదు. ఒకరోజు నెహ్రూపార్కులో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్న సుమిత్ర చెవులకు బాగా పరిచయమున్న గొంతు వినిపించేసరికి ఆ గొంతును ఆలకించసాగింది.

"దేవి అనవసరంగా గొడవ చెయ్యొద్దు. అసలు నిన్ను నేను ప్రేమించాననడానికి ఆధారం ఏమైనా వుందా? వుండదు కాబట్టి నోరు మూసుకుని నేను చెప్పినట్లు నడుచుకో"
"నువ్వు చెప్పినట్లు నడుచుకోబట్టే యిప్పుడు ఒక బిడ్డకు తల్లివి కాబోతున్నాను" ఆడగొంతు.
"నా వల్లే తల్లివి కాబోతున్నావన్న గ్యారంటీ వుందా? అసలు నువ్వు నాతో తిరిగిందానికి ఆధారాలున్నాయా?"
"ఛీ నువ్వింత మోసగాడివనుకోలేదు... ఇప్పుడు అనుకుంటున్నావుగా... వస్తాను గుడ్ బై..." అంటూ వెళ్ళిపోయాడతను.
ఆ కంఠం తన మాజీ ప్రియుడు అమర్‌దే.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది...
మొగుళ్లు (మగాళ్లు) జిందాబాద్..
నిన్ను నాకు అమ్మేశాడు
ప్రాణం పోసిన హిందూ హృదయం...
నీ మొహానికి రెండు లక్షలు కుమ్మరించాం...
నీ అంతు చూసేందుకే పెళ్లి చేసుకున్నా...