ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కథలు > నేను పేదింటి పిల్లను కాను...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను పేదింటి పిల్లను కాను...
మౌనంగా రోదిస్తున్న దేవి దగ్గరకు వెళ్ళింది సుమిత్ర. "చూడమ్మా ఆడది ఎప్పుడూ తన జాగ్రత్తలో తను ఉండాలి. అలా లేకపోతే ఈ మేకవన్నె పులులు దాడిచేసి ఆడదాని జీవితాలను నాశనం చేస్తాయి" అని ఆవేశంగా మాట్లాడుతున్న సుమిత్రను చూసి .. "మీరు.." అంటూ మధ్యలో ప్రశ్నించింది దేవి.

నేనెవరైతే ఎందుకుకానీ ప్రస్తుతానికి అమర్‌తో తిరిగినట్టు సాక్ష్యం నీకు కావాలి. కాబట్టి ప్రస్తుతం మీరిద్దరూ కూర్చున్నప్పుడు నేను తీసిన ఫోటో డెవలప్ చేయించి యిస్తాను. ఆ ఆధారం అతనికి చూపించు...

అంతే కాదు. నాకు తెలిసిన డాక్టర్ ద్వారా నీకు పుట్టే బిడ్డకు తండ్రి అమర్ అని శాస్త్రపరంగా రుజువుచేసి కోర్టుకీడుస్తాను అని చెప్పు. అప్పటికీ పెళ్ళికి అంగీకరించకపోతే చట్టపరంగా అతనిచేత నీ మెళ్ళో మూడుముళ్ళు వేయించే బాధ్యత నాది అంటూ ధైర్యం చెప్పింది సుమిత్ర. దేవి కంటికి సుమిత్ర ఒక దేవతలా కన్పించసాగింది.

"హాల్లో సుమిత్రగారూ. పై నెల పదో తేదిన నా పెళ్ళి... మొదటి యిన్విటేషన్ మీకే యివ్వాలని వచ్చాను. అంటూ వెడ్డింగ్ కార్డిచ్చింది దేవి. వెడ్డింగ్ కార్డు చేతికి తీసుకొని చూస్తున్న సుమిత్రను... తప్పకుండా వస్తారు కదూ? అని దేవి ప్రశ్నించేసరికి... తప్పక వస్తాను అంది సుమిత్ర..

పెళ్ళి హడావిడి తగ్గి చదివింపులు కార్యక్రమం వచ్చేసరికి... అమర్ పేరుతో ఒక చిన్న గిఫ్ట్ ప్యాకెట్ చదివిస్తున్న సుమిత్రను చూసిన అమర్ తలవంచుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ తెరచిచూస్తే అందులో ఒక చిన్న కాగితం కన్పించింది. ఆత్రంగా మడత విప్పాడు.

మిస్టర్ అమర్... నువ్వు నన్ను ప్రేమించి మోసం చేశావు. అయితే దేవిని తల్లినిచేసి మరీ మోసం చెయ్యాలని చూశావు. కానీ చెయ్యలేకపోయావు. నన్ను నువ్వు మోసం చేశాననుకుంటున్నావు కదూ?

కాదు... నువ్వే మోసగించబడ్డావు. నీతో చెప్పినట్లుగా నేనేమీ పేదింటి పిల్లను కాదు. గొప్ప ధనవంతురాలి ఏకైక కుమార్తెను. గుడ్‌బై... నెక్స్‌ట్ వీక్ అమెరికా వెళ్తున్నాను... అక్కడే నా పెళ్ళి. వుంటాను. ఆపై ఆమె పేరు చదువుదామన్నా అమర్ కంటికి అక్షరాలు సరిగా కన్పించడం మానేసాయి.
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది...
మొగుళ్లు (మగాళ్లు) జిందాబాద్..
నిన్ను నాకు అమ్మేశాడు
ప్రాణం పోసిన హిందూ హృదయం...
నీ మొహానికి రెండు లక్షలు కుమ్మరించాం...
నీ అంతు చూసేందుకే పెళ్లి చేసుకున్నా...