పెద్ద పాత్రలో క్రీమ్, వెన్న మరియు చక్కెరను వేసి, ఎలక్ట్రిక్ మిక్సర్‌తో బాగా కలపాలి. కోడిగ్రుడ్డు తెల్లసొనను కూడా చేర్చి, బాగా కలపాలి. బేకింగ్ పౌడర్‌తో పాటు పిండి, కోకో పౌడర్ మరియు కాపీ గింజలను చేర్చుతూ బాగా బ్లెండ్ అయ్యేవరకు కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి, ఒకవేళ గట్టిపడితే కొంచెం నీళ్లను చేర్చి మెత్తగా చేయాలి. కుక్కీ బేకింగ్ షీట్‌పై వెన్న పూయాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని షీట్‌పై ఉంచి, కొంచెం మందంగా ఉండేలా రుద్దాలి.
ఓవెన్‌ను ముందుగా హీట్ చేసి 20 నిమిషాల పాటు 350 డిగ్రీల వేడిలో ఈ మిశ్రమాన్ని బేక్ చేసి ఉన్నట్లు చూసుకోవాలి. కుక్కీ పై భాగంలో సన్నని పొర లేదా కొద్ది పాటి పొర అయినా ఏర్పడిందేమో తాకి చూడండి. సరిగ్గా బేక్ అయిందని చూసేందుకు కత్తి పెట్టి చూడాలి. పూర్తయిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి.
|