దేశంలోనే తొలిసారిగా మొదటి గ్లోబల్ ఎన్‌ఆర్ఐ కన్వెన్షన్ ఆన్ థీమ్.. ఒరిస్సా అనే అంశంపై గత ఏడాది దేశ రాజధాని న్యూడిల్లీలో ఓ సదస్సును జరిగింది. దీన్ని కేంద్ర మంత్రి వాయలార్ రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇందులో ఒరిస్సా రాష్ట్ర పర్యాటకం, ఐటీ, బీపీఔ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ సర్వీసెస్ తదితర అంశాలపై ప్రధానోపన్యాసాలు సాగాయి. గత డిసెంబరు 16 నుంచి 20 తేదీల మధ్య జరిగిన ఈ సదస్సులో 17వ తేదీన ఒరిస్సా సంస్కృతి ప్రతిబింబించే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
|