ప్రవాస భారతీయురాలు శ్రుతి వదేరా అరుదైన ఘనత సాధించారు. బుధవారం టోనీబ్లెయిర్ స్థానంలో బ్రిటన్ ప్రధాని పదవిని చేపడుతున్న గార్డన్ బ్రోన్ క్యాబినెట్‌లో విధాన నిర్ణాయక కమిటీ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 1999 నుంచి బ్రిటన్ ఖజానా ఆర్థిక సలహాదారుల కమిటీలో సభ్యురాలిగా ఉన్న శ్రుతి వదేరా గార్డన్ బ్రోన్‌కు ప్రత్యేక సలహాదారు కూడా. ఆయన మీద వదేరా ప్రభావం చాలా ఉందని, ఆయనకు సంబంధించిన కీలక సమావేశాలకు ఆమె హాజరవుతారని ది సండే టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.
అంతకు ముందు ఆమె బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. వార్బరగ్ దిల్లాన్ రీడ్ బ్యాంకులో ఆమె అనేకబాంకింగ్ వ్యవస్థను పటిష్టీకరించడం, ప్రభుత్వ ప్రైవేటు భాగసామ్యాలు, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వహించారు. ఖజానాకు బదిలీ అయ్యే ముందు ఆమె ప్రభుత్వరంగంలో దక్షిణాఫ్రికాతో కలిసి బ్యాంకు వ్యాపారాన్ని పెంపొందించేందుకు కృషి చే శారు.
|