కొకైన్ తీసుకువస్తున్న ఒక భారత మహిళను కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు.. కొకైన్‌తో పట్టుబడ్డ ఆమెను నెగొంబో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచినట్లు శ్రీలంక నార్కోటిక్ బ్యూరో అధికారులు వెల్లడించారు.ఈ విషయమై నార్కోటిక్ బ్యూర్ డీఐజీ నిమల్ లెవకె మీడియాతో మాట్లాడుతూ.... కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్ నుంచి వచ్చిన విమానంలోంచి ఈ మహిళ దిగినట్లు వివరించారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఆమెను సోదా చేయగా.. 480 గ్రాముల కొకైన్ బయటపడిందని ఆయన పేర్కొన్నారు.45 సంవత్సరాల వయసు గల ఈ మహిళ వద్దనుంచి స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ దాదాపు 70 లక్షల రూపాయల వరకూ ఉంటుందనీ... ఈ సంఘటన గురించి వెంటనే భారత అధికారులకు తెలియజేస్తామని పోలీసు సమాచార ప్రతినిధి రంజిత్ గుణశేఖర చెప్పారు. |