తెలుగు అమ్మాయి నిఖిత త్రిపురనేని... కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయం నార్త్‌రిడ్జ్ జీవశాస్త్ర విద్యార్థులకిచ్చే ప్రతిష్టాత్మక బెన్నెట్-బిక్ ఫోర్డ్ అవార్డును సొంతం చేసుకుంది.ఈ విషయమై కాలిఫోర్నియా స్టే విశ్వ విద్యాలయం జీవశాస్త్ర విభాగానికి చెందిన రాండీ డబ్ల్యు. కొహెన్, పాల్ విల్సన్‌లు మాట్లాడుతూ... అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే జీవశాస్త్ర అధ్యయనంలో నిఖిత ప్రదర్శించిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్లు వెల్లడించారు.ఇదిలా ఉంటే... హైదరాబాదు నగరానికి చెందిన త్రిపురనేని రాజేంద్ర కుమార్తె నిఖిత.. అమెరికాలోని కాలిఫోర్నియాస్టేట్ నార్త్‌రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో అండర్‌గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తోంది. ఈ అవార్డును పొందేవారి పేర్లను విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగంలో ప్రదర్శిస్తారు.కాగా... మే 19న బొటానికల్ గార్డెన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈఅవార్డును నిఖితకు అందజేయనున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ సైన్స్, మేథమేటిక్స్, జీవశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. |