దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడు జాకబ్ జుమా భారత సంతతికి చెందిన మరో నేతను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి మాగీ గోవెండర్ (50) చేరికతో జాకబ్ కేబినెట్‌లోని భారత సంతతి మంత్రుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
క్వాజులూ-నటల్ ప్రావిన్స్ కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా గోవెండర్‌కు జాకబ్ జుమా బాధ్యతలు అప్పగించారు. కాగా... మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ, అధ్యక్షుడు తనపై విశ్వాసం ఉంచి అప్పజెప్పిన అత్యంత కీలకమైన మంత్రి పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే... డర్బన్‌కు చెందిన మాగీ వృత్తరీత్యా విద్యావేత్తగానే కాకుండా, నాటల్ ఇండియన్ కాంగ్రెస్ మాజీ అధికారిణిగా, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో పాటు మరికొన్ని సంస్థలతో కలసి వర్ణవివక్షపై ఎనలేని పోరాటం చేశారు. |