కార్పొరేట్ రంగానికి చెందిన ఓ ప్రవాస భారతీయ మహిళా సీఈ ఓ రష్మీ సిన్హా.. అనూహ్యంగా అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ "ప్లేబోయ్" లిస్టులో స్థానం సంపాదించారు. అమెరికాలో పదిమంది సెక్సీయెస్ట్ సీఈఓల్లో ఒకరిగా "స్లైడ్‌షేర్" వెబ్‌సైట్ సీఈఓ అయిన రష్మి నిలిచారు.ఆకట్టుకునే అందం, వ్యాపార వ్యూహాల్లో నైపుణ్యం ఆధారంగా ప్లేబోయ్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఇందులో చిన్నస్థాయి సంస్థలు మొదలుకుని భారీ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మహిళా సీఈఓలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్లేబోయ్ పత్రిక ప్రకటించింది.రష్మీతో పాటు లోదుస్తులను విక్రయించే రీటైల్ కంపెనీ జర్నెల్లీకి చెందిన క్లెయిర్ చాంబర్స్, ఫిట్‌నెస్ లైఫ్‌స్టయిల్ సంస్థ ఫ్లర్టీ గర్ల్ ఫిట్‌నెస్‌కి చెందిన కెర్రీ నీ, గ్రాస్పర్ సైట్ సీఈఓ తెరెసా ఫిలిప్స్ తదితరులు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ప్రస్తుతం నిస్తేజంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వీరి అందం, నైపుణ్యాలు సూర్య కిరణాల్లాంటివని ప్లేబోయ్ ఓ ప్రకటనలో పేర్కొంది.న్యూరో సైన్స్‌లో డాక్టరేట్ అందుకున్న రష్మీ సిన్హా 2007వ సంవత్సరంలో స్లైడ్‌షేర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఎక్కడ నుంచయినా యాక్సెస్ చేసుకునే విధంగా యూజర్లు ఈ సైట్‌లో తమ ప్రజెంటేషన్లను భద్రపర్చుకోవచ్చు. హారాల్డ్ అండ్ కుమార్ గో టు వైట్ క్యాజిల్, అరెస్టెడ్ డెవలప్‌మెంట్ లాంటి టీవీ షోలంటే అమితంగా ఇష్టపడే రష్మీ.. గతంలో ఆన్‌లైన్ గేమింగ్‌పే క్లయింట్ రీసెర్చీని కూడా పూర్తి చేశారు.ఇదిలా ఉంటే... ఢిల్లీ, శాన్‌ఫ్రాన్సిస్కోలు రెండింటినీ తన సొంత ఊర్లలాగానే భావిస్తానని, ప్లేబోయ్‌లో స్థానం సంపాదించుకున్న రష్మీ తన వ్యక్తిగత బ్లాగులో ఆనందం వ్యక్తం చేశారు. |