ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ఎన్.ఆర్.ఐ. మహిళలు > స్మగ్లింగ్ నేరంపై ఎన్నారై మహిళ అరెస్టు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్మగ్లింగ్ నేరంపై ఎన్నారై మహిళ అరెస్టు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నిందితురాలైన ఎన్నారై మహిళను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడిన నేరంపై ఒక భారత మహిళతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మలేషియా అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి ఆరు పాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ విభాగంలోని నేర విచారణాధికారి కాంగ్ చెజ్ చియాంగ్ పేర్కొన్నారు. నిందితులు మరికొన్ని మాదక ద్రవ్య పదార్థాలను నిందితులు లాప్‌టాప్‌లో దాచారన్నారు. వీరి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ 2.8 కేజీల బరువుందనీ, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 40 వేల అమెరికన్ డాలర్లని చియాంగ్ వివరించారు.

మత్తు పదార్థాలను లాప్‌టాప్‌లో భద్రపరచిన తొలి స్మగ్లర్ల ముఠాగా నిందితులు అప్రతిష్టను మూటగట్టుకున్నారని మలేషియా పోలీసులు తెలిపారు. వీరు మత్తు పదార్థాలను పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌ల నుంచి ఇండోనేషియాకు అక్రమంగా తరలిస్తూ నేరానికి పాల్పడుతున్నారన్నారు.

ఇదిలా ఉంటే... అరెస్టైన వారిలో భారత మహిళతో పాటు ఇండోనేషియాకు చెందిన ఓ జంట మరో పాకిస్థాన్ జాతీయుడు ఉన్నారని, వీరు 28 నుంచి 48 మధ్య వయసును కలిగి ఉన్నారని పోలీసులు చెప్పారు. కాగా.. భారత మహిళ తన తల్లిదండ్రులతో ఇండోనేషియాలో నివాసం ఉంటోందా లేక అక్రమ వలస ఉంటోందా అని నిర్ధారించాల్సి ఉందన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"సౌత్ కరోలినా" గవర్నర్ రేసులో ఎన్నారై నిక్కీ
కెనడా ఎన్నారై నేత రూబీ ధల్లాకు "క్లీన్‌చిట్"
దుబాయిలో తెలుగు మహిళా సంఘం "వేవ్"
తాంత్రిక శృంగారంపై హీథర్ వ్యాఖ్యలు
నిషేధిత వైద్యుడి చేతిలో ఎన్నారై మహిళ మృతి
నగల అక్రమ రవాణా ఆరోపణలపై శీతల్‌కు జైలు