ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ఎన్.ఆర్.ఐ. మహిళలు > ఆస్ట్రేలియాలో భారత మహిళ మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆస్ట్రేలియాలో భారత మహిళ మృతి
FILE
ఆరునెలల గర్భంతో ఉన్న భారత సంతతికి చెందిన ప్రాషిలా విల్సన్ అనే మహిళ ఆస్ట్రేలియాలోని ట్వీడ్ నదిలో మునిగి చనిపోయారు. మృతురాలు ప్రయాణించిన విలాసవంతమైన నౌకకు సమీపంలో ఆమె శవం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. హెరాల్డ్ సన్ పత్రికా కథనం ప్రకారం... నౌకకు 30 మీటర్ల దూరంలో ప్రాషిలా మృతదేహాన్ని సోమవారం కనుగొన్నట్లు తెలుస్తోంది.

తన భార్య కనిపించటం లేదంటూ మృతురాలి భర్త మైఖేల్ సీరీ ఫిర్యాదు చేయడంతో, ప్రాషిలా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారి మైఖేల్ కెన్నీ మాట్లాడుతూ... ప్రాషిలా కనిపించడం లేదంటూ, ట్వీడ్ హెడ్‌లోని ఇవోరి కోస్ట్ మారినా నుంచి శనివారం రాత్రి తమకు ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రాషిలాకు ఈత రాదని, ఆమె ఆరునెలల గర్భంతో కూడా ఉన్నట్లు కెన్నీ వివరించారు. ట్వీడ్ నదిలో ఆమెకోసం తీవ్రంగా గాలించగా... సోమవారంనాడు విల్సన్ మృతదేహం లభ్యమైనట్లు ఆయన తెలిపారు. కాగా... మృతురాలు ప్రమాదవశాత్తు చనిపోయిందా, లేక మరే ఇతర కారణాలున్నాయన్న కోణంమీద డిటెక్టివ్‌ల చేత దర్యాప్తు చేయించనున్నట్లు కెన్నీ తెలియజేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్మగ్లింగ్ నేరంపై ఎన్నారై మహిళ అరెస్టు
"సౌత్ కరోలినా" గవర్నర్ రేసులో ఎన్నారై నిక్కీ
కెనడా ఎన్నారై నేత రూబీ ధల్లాకు "క్లీన్‌చిట్"
దుబాయిలో తెలుగు మహిళా సంఘం "వేవ్"
తాంత్రిక శృంగారంపై హీథర్ వ్యాఖ్యలు
నిషేధిత వైద్యుడి చేతిలో ఎన్నారై మహిళ మృతి