ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » సిక్కు మహిళకు "ఫ్రైడ్ ఆఫ్ బ్రిటన్" అవార్డు (NRI | Nri Women | Sikh woman | Jasvinder Sanghera | Pride of Britain Award | Karma Nirvana)
 
Women
FILE
బలవంతపు వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ సంతతికి చెందిన సిక్కు మహిళ జస్విందర్ సంఘేరా (44) ప్రతిష్టాత్మకమైన "ఫ్రైడ్ ఆఫ్ బ్రిటన్" అవార్డుకు ఎంపికయ్యారు. జస్విందర్ కృషి కారణంగా, బ్రిటన్ ప్రభుత్వం బలవంతపు పెళ్లిళ్లకు వ్యతిరేకంగా పటిష్టమైన చర్యలను చేపట్టింది.

కాగా.. పన్నెండు సంవత్సర జేక్ పీచ్, 75 సంవత్సరాల వృద్ధుడు సర్ పీటర్ మేన్స్ ఫీల్డ్‌‌లకు కూడా 2009 సంవత్సరానికిగానూ "ఫ్రైడ్ ఆఫ్ బ్రిటన్" అవార్డు లభించింది. లుకేమియా వ్యాధిగ్రస్తుడైనప్పటికీ, మృత్యువుతో పోరాడుతున్న పీచ్.. తనలాంటి వ్యాధిగ్రస్తుల కోసం సాయపడేందుకు నిధులు సేకరించినందుకుగానూ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అలాగే నోబెల్ బహుమతి గ్రహీత, ఎమ్ఆర్ఐ స్కానర్ ఆవిష్కర్త అయిన సర్ పీటర్ మేన్స్.. జీవితకాల కృషికిగానూ ఈ అవార్డును అందుకోనున్నారు.

ఇదిలా ఉంటే.. జస్విందర్ అక్క రొబీనా బలవంతపు పెళ్లిని తప్పించుకునేందుకు 1983వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత తన పదిహేనేళ్ల ప్రాయంలోనే బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించటంతో, అది ఇష్టంలేని జస్విందర్ ఇల్లువదిలి పారిపోయింది.

ఈ స్వానుభవాలతో ఎలాగైనా సరే బలవంతపు పెళ్లిళ్ల నుంచి బాధితులను రక్షించాలన్న ఉద్దేశ్యంతో... 1993వ సంవత్సరంలో జస్విందర్ బలవంతపు పెళ్లిళ్ల బాధితుల సహాయం కోసం డెర్బీలో "కర్మ నిర్వాణ" అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా బలవంతపు పెళ్లిళ్ల అదుపుకు నిరంతరాయంగా పోరాటం సల్పిన ఈమెకు బ్రిటన్ ప్రభుత్వం కూడా తోడయ్యింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.