ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » ఎన్నారై మహిళా డాక్టర్‌పై బ్రిటన్ నిషేధం..! (NRI | Nri Women | Indian Origin | Woman Doctor | General Medical Council | Kolkata | Soma Mandal)
 
భారతీయ సంతతికి చెందిన మహిళా డాక్టర్‌పై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. జనరల్ మెడికల్ కౌన్సిల్ (జీఎమ్‌సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.

కాగా.. కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుమా మాండల్ (66) జీఎమ్‌సీ నిర్వహించిన చిన్న పిల్లల వైద్య పరీక్షలో ఆరుసార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో మెడికల్ ప్రాక్టీస్ చేయకుండా ఆమెపై నిషేధం విధించిన బ్రిటన్ ప్రభుత్వం.. మెడికల్ రిజిస్టర్ నుంచి కూడా ఆమె పేరును తొలగించారు.

ఇదిలా ఉంటే.. డాక్టర్ సుమా మాండల్ పనితీరును సమీక్షించిన జీఎమ్‌సీ 2006 సెప్టెంబర్‌లో ఒక సంవత్సరంపాటు నిషేధం విధించింది. అయితే తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని ఆమె విజ్ఞప్తి చేసుకోవడంతో తిరిగీ 2007వ సంవత్సరంలో నిషేధాన్ని ఎత్తివేశారు. ఇదే సంవత్సరం నిర్వహించిన చిన్న పిల్లల వైద్య పరీక్షలో నిర్దేశిత మార్కులు కూడా సంపాదించక పోవటంతో బ్రిటన్ ప్రభుత్వం ఆమెపై నిషేధం వేటు వేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.