ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » చికాగో ఐఐటీ సదస్సుకు మంత్రి పురంధరేశ్వరి (NRI | Nri Women | Pan-Indian Institute of Technology (IIT) | Global Conference | D.Purandeswari)
Feedback Print Bookmark and Share
 
Purandhareswari
FILE
పాన్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వార్షిక ఏడవ అంతర్జాతీయ సదస్సుకు భారత మానవ వనరుల శాఖ సహాయమంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరుకానున్నారు. కాగా.. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సు నేడు చికాగోలో అంగరంగవైభవంగా ప్రారంభం కానుంది.

మూడు వేలమంది ఐఐటీయన్లు హాజరుకానున్న ఈ అంతర్జాతీయ సదస్సు... మిరుమిట్లు గొలిపే లేజర్ షో, ఇతర కార్యక్రమాల ప్రదర్శన అనంతరం ప్రారంభం అవుతుంది. ఈ సదస్సుకు మన కేంద్ర మంత్రి పురంధరేశ్వరితోపాటు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ ముఖ్య సాంకేతికాధికారి అనీస్ చోప్రా.. తదితరులు పాల్గోనున్నారు.

ఇంకా ప్రముఖ ఐఐటీయన్లు అయిన శ్యామ్ పిట్రోడా, రజత్ గుప్తా, వినోద్ కొస్లా, అర్జున్ మల్హోత్రా, కన్వాల్ రేఖి తదితరులు కూడా ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గోనున్నారు. పైన పేర్కొన్న ప్రముఖులందరూ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా సదస్సు ఛైర్మన్ రాయ్ మెహ్రా మాట్లాడుతూ.. సదస్సుకు సంబంధించిన అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయనీ.. మరింతమంది అతిథులను ఆహ్వానించేందుకుగానూ సీట్ల సంఖ్యను పెంచాల్సిందిగా "సిటీ ఫైర్ బ్రిగేడ్"ను అనుమతి కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.