ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » ఎన్నారైలపై పురంధరేశ్వరి ప్రశంసల జల్లులు (NRI | Nri Women | Purandareswari | America | Indians | Chicago | PAN IIT Seminar | Sam Pitroda)
Feedback Print Bookmark and Share
 
Purandhareswari
FILE
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఐటీ, వైద్యం, ఇంజనీరింగ్, బోధన తదితర రంగాలలో నిపుణులైన భారతీయులు ఎంతగానో తోడ్పడుతూ.. భారతదేశ ప్రతిష్టకు వన్నె తెస్తున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రశంసించారు.

అమెరికా పర్యటనలో ఉన్న పురంధరేశ్వరి చికాగోలో జరిగిన పాన్ ఐఐటీ సదస్సులో పాల్గొన్న సంగతి విదితమే. సదస్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో పై విధంగా స్పందించారు. ఈ విందులో ప్రధానమంత్రి సలహాదారు శ్యాంపిట్రోడా, చికాగోలోని ఇండియన్ జనరల్ అశోక్, వివిధ రంగాలకు చెందిన 200 మంది భారతీయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. అమెరికా అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారతీయులను ఆమె ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఏర్పడ్డ వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రవాస భారతీయులంతా ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.