ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » దాడులవల్ల విద్యార్థుల సంఖ్య తగ్గలేదు : గిల్లార్డ్ (NRI Women | Australia | Deputy Prime Minister | Julia Gillard | Sydney | Colleges | International Students)
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా విద్యార్థులపై జరుగుతున్న దాడులు.. తమ దేశంపై ఉండే నమ్మకంపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని ఆ దేశ ఉప ప్రధానమంత్రి జూలియా గిల్లార్డ్ వ్యాఖ్యానించారు. దాడుల వల్ల తమ దేశంలో విద్యనభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదని ఆమె అన్నారు.
సిడ్నీలో గురువారం జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన్న గిల్లార్డ్ మాట్లాడుతూ.. తమ అంతర్జాతీయ విద్యారంగం గత సంవత్సర కాలంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉందని, విదేశీ విద్యార్థుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందని తెలిపారు.
అయితే... విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోన్న బోగస్ కళాశాలలపై ఆందోళన వ్యక్తం చేసిన గిల్లార్డ్.. వాటిని ఏరివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా తమ దేశంలో విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు అన్నిరకాలుగా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు తగినంత కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె హామీనిచ్చారు.