ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » యూకే పర్యటన : ప్రతిభకు భారతీయుల విందు..! (NRI Women | Britain | Indian President | Pratibha Patil | High Commissioner | Navin Suri | London)
మూడు రోజులపాటు బ్రిటన్‌లో పర్యటించనున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్‌ను.. అక్కడి భారతీయ ప్రతినిధులు ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందులో సుమారు 400 మంది భారతీయ ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా.. ఈ విందు కార్యక్రమాన్ని భారత హైకమీషనర్ నళిన్ సూరీ ఆధ్వర్యంలో.. లండన్ మారియట్ హోటల్‌లో నిర్వహించనున్నారు.
నేషనల్ హెల్త్ సర్వీసుల్లోనూ, ఐటీ మరియు భోధనా రంగాల్లోనూ పనిచేస్తున్న రెండు మిలియన్లకు పైబడిన భారతీయులు భారత్ బ్రిటన్ దేశాల నడుమ వారధులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిందరి తరపునా 400 మంది భారతీయ ప్రతినిధులు భారత రాష్ట్రపతిని ఘనంగా సత్కరించనున్నారు.
ఇండియన్ హౌస్‌కు సంబంధించిన వార్తా ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో పనిచేస్తున్న 20 మందికి పైబడిన ప్రవాస భారతీయ సభ్యులు, హౌస్ ఆఫ్ కామన్స్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఎంపీలు, వంద మందికి పైబడి కౌన్సిలర్లు.. బ్రిటన్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీరందరూ కూడా విందు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఇంకా.. భారత రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న కొంతమంది ముఖ్య స్నేహితులు, సామాజిక శాస్త్రవేత్తలు, రచయితలు, కళాకారులు, హిందూజా ఫౌండేషన్‌లో పనిచేస్తున్న కార్యకర్తలు, ది లూంబా ట్రస్ట్ మరియు ప్రిన్సెస్ ట్రస్ట్.. మొదలైన వారందరినీ కూడా ఈ ప్రత్యేక విందుకు హాజరుకానున్నట్లు ఇండియన్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ప్రతిభా పాటిల్ అక్టోబర్ 27న బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. కాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో బ్రిటన్‌లో పర్యటించబోయే మొట్టమొదటి భారత రాష్ట్రపతి ప్రతిభ కావటం విశేషం.