ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » హైదరాబాద్ వైద్యురాలికి అమెరికాలో అరుదైన గౌరవం (NRI Women | Hyderabad | America | Dr Kalpalatha K Guntupalli | The American College of Chest)
Feedback Print Bookmark and Share
 
Woman
FILE
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఛాతీ వైద్య నిపుణురాలు కల్పలత గుంటుపల్లి ప్రతిష్టాత్మకమైన "అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్ (ఏసీసీపీ)" అధ్యక్షురాలిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అలాగే.. ఈ పదవికి ఎన్నికైన మొట్టమొదటి ఆసియా అమెరికన్ మహిళగా కూడా ఈమె రికార్డు సృష్టించారు.

అమెరికాలోని ఏ వైద్య సంఘానికైనాగానీ ఒక భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు కావటం ఇదే ప్రథమం. కల్పలత ప్రస్తుతం ప్రతిష్టాత్మక "బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్"లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది అమెరికాలోని పది అగ్రశ్రేణి కళాశాలల్లో ఒకటి కావడం గమనార్హం.

ఈ సందర్భంగా కల్పలత మాట్లాడుతూ... 2010 సంవత్సరాన్ని "ఛాతీ సంవత్సరం"గా పేర్కొన్న నేపథ్యంలో ఛాతీ ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా తన వంతు కృషి చేసేందుకు ఏసీసీపీ అధ్యక్ష బాధ్యత తనకు దోహదకారి అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. శాన్‌డిగోలో నవంబర్ ఒకటవ తేదీన జరిగే ఓ కార్యక్రమంలో ఏసీసీపీ అధ్యక్ష బాధ్యతలను ఈమె స్వీకరించనున్నారు.

ఇదిలా ఉంటే.. కల్పలత హైదారాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎమ్‌.డీ విద్యను అభ్యసించారు. ఇంటర్నల్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ కోసం 1974లో అమెరికా వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడ్డారు. ఆ తరువాత ఆమె సాధించిన అనేక విజయాలకుగానూ అనేక అవార్డులను అందుకున్నారు. వాటిలో "పార్కర్ జె పామర్ కరేజ్ టు టీచ్" ఒకటి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.