ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » న్యూజెర్సీలో "యూటా" మహిళా సంబరాలు (NRI Women | New Jersey | North America | UTAA | Edison | Royal Albert Palace | Fashion Show | Dance)
ఉత్తర అమెరికా తెలుగువారి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని రీతిలో "యునైటెడ్ తెలుగు అమెరికన్ అసోసియేషన్ (యూటా)" మహిళా సంబరాలు వైభవంగా జరిగాయి. ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ సంబరాలు ఆద్యంతం ఆహ్లాదకరంగా, ఉత్సాహపూరితంగా సాగాయి.
ఈ మహిళా సంబరాల్లో వివిధ రంగాలకు చెందిన తెలుగు మహిళలు 700 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. సంబరాల్లో భాగంగా.. వివిధ వయస్సు, గ్రూపు విభాగాల్లో యూటా నిర్వహించిన ఫ్యాషన్ షోలు, డ్యాన్స్‌లు, ఆటల పోటీలలో మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు "బెస్ట్ డ్రెస్డ్ విమెన్ ఆఫ్ ద డే" అవార్డుతో యూటా సత్కరించింది.
రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనా స్టాల్స్‌ను మహిళలు చాలా ఆసక్తిగా తిలకించారు. ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు, విలువైన రాళ్లు, పువ్వులు, అలంకరణ సామగ్రి... తదితరాలతో కూడిన స్టాల్స్‌ను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.
యూటా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళా సంబరాలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వారాల తరబడీ శ్రమించిన వలంటీర్ల బృందాన్ని వారు కొనియాడారు. వలంటీర్ల కృషికి గుర్తింపుగా ఈ సంబరాలను వారికే అంకితం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు.