ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » ప్రవాస మహిళా ప్రొఫెసర్‌కు గౌరవ డాక్టరేట్ (NRI Women | Paediatric Gastroenterologist | Professor | Bhupinder Kaur Sandhu | Bristol)
Feedback Print Bookmark and Share
 
Nri Women
FILE
భారత సంతతికి చెందిన చిన్న పిల్లల వైద్యురాలు ప్రొఫెసర్ భూపీందర్ కౌర్ సాంధుకు బ్రిస్టల్‌లోని వెస్ట్ ఇంగ్లండ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నందుకు మరియు సైన్స్, మెడిసిన్ రంగాలలో మహిళలకు ఆదర్శంగా నిలిచినందుకుగానూ కౌర్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన కౌర్ 12 సంవత్సరాల ప్రాయంలోనే 1963లో బ్రిటన్‌కు వలస వచ్చారు. 1974లో లండన్‌ యూనివర్సిటీ కాలేజీ నుంచి మెడిసిన్ పూర్తి చేసిన ఆమె.. అనంతరం పలు ఆసుపత్రులలో తన సేవలను అందించారు. బ్రిస్టల్‌లో పనిచేస్తున్న కాలంలో చిన్నపిల్లల్లో పోషకార సమస్యల పరిష్కారం కోసం కౌర్ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం కౌర్ వెస్ట్ ఇంగ్లండ్, బ్రిస్టర్ యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2002వ సంవత్సరంలో చెరీ బ్లెయిర్ "ప్రొఫెషనల్ ఇయర్ ఆఫ్ ద అవార్డు"ను ఆమె అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడంపట్ల కౌర్ సంతోషం వ్యక్తం చేస్తూ, వైద్య నిపుణులందరికీ లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.