ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » పాకశాస్త్ర రచయిత భోగాల్‌కు "కుక్ బుక్" అవార్డు (NRI Womens | Indian Origen | Food Writer | Stylist | Ravinder Bhogal | Gourmand World Cookbook)
Bookmark and Share Feedback Print
 
Nri women
FILE
భారత సంతతికి చెందిన పాకశాస్త్ర రచయిత, స్టైలిస్ట్ రవీందర్ భోగాల్‌కు ప్రతిష్టాత్మక "గార్మాండ్ వరల్డ్ కుక్ బుక్" అవార్డును కైవసం చేసుకుంది. భోగాల్ రచించిన "కుక్ ఇన్ బూట్స్" పుస్తకానికిగానూ ఆమెను ఈ కుక్ బుక్ అవార్డు వరించింది. అంతేగాకుండా బ్రిటన్‌లో బెస్ట్ కుక్ బుక్‌గా ఈ పుస్తకాన్ని ఎంపిక చేశారు.

అలాగే 2010వ సంవత్సరంలో జరగబోయే ప్రపంచ అత్యుత్తమ పాకశాస్త్ర పుస్తక పోటీలలో కూడా "కుక్ ఇన్ బూట్స్" నిలువనుంది. ఈ సందర్భంగా భోగాల్ మాట్లాడుతూ... తన పుస్తకానికి గార్మాండ్ అవార్డు రావటం చాలా ఆనందాన్నిస్తోందని అన్నారు. ప్రపంచ పాక శాస్త్ర పుస్తక పోటీలో పాల్గొనే గౌరవం కూడా తన పుస్తకానికి దక్కటంతో చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు.

136 దేశాలకు చెంది 26 వేల పుస్తకాలు గార్మాండ్ వరల్డ్ కుక్ బుక్ అవార్డుకు పోటీ పడగా, అందులో భోగాల్ రచన విశిష్ట స్థానాన్ని పొంది, అవార్డును దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ లండన్‌లో నివసిస్తున్న రవీందర్ భోగాల్ తన రెండో పుస్తకాన్ని కూడా 2010లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.