ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » సరబ్ విడుదలకు బ్రిటన్ ఎన్నారై మహిళ పోరాటం (NRI Women | Pakistan | Sarabjit Singh | Britan Lawyer | Jas Uppal | BBC News website | Punjab)
పాకిస్థాన్ మరణశిక్ష విధించిన భారత పౌరుడు సరబ్‌జిత్ సింగ్ విడుదల కోసం భారత సంతతికి చెందిన బ్రిటన్ న్యాయవాది జాస్ ఉప్పల్ పోరాటానికి శ్రీకారం చుట్టారు. సరబ్‌జిత్‌కు మద్ధతుగా అంతర్జాతీయ ప్రచారాన్ని మొదలుపెట్టిన ఈ ఎన్నారై మహిళ, ఇందులో భాగంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఫ్రీసరబ్‌జిత్‌సింగ్.కామ్ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో జాస్ ఉప్పల్ మాట్లాడుతూ.. బీబీసీ న్యూస్ వెబ్‌సైట్‌లో సరబ్‌జిత్ దీనస్థితి ఉదంతాన్ని చూసిన తరువాత ఆయనకు మద్ధతుగా ప్రచారం ప్రారంభించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవహక్కుల సంస్థలు, న్యాయవాదుల దృష్టికి సరబ్‌జిత్ కేసును తీసుకెళ్లి, అతడికి న్యాయం జరిగేలా కృషి చేయనున్నట్లు తెలిపారు.
సరబ్‌జిత్ కేసును న్యాయస్థానం నిష్పక్షపాతంగా విచారించలేదనీ, అలాగే విచారణ సందర్భంగా సరబ్‌తో ఆంగ్లంలో మాట్లాడటంపై కూడా జాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం హిందీ, పంజాబీ వచ్చిన వ్యక్తిని ఆంగ్ల భాషలో విచారించటం ఏం న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. పాక్‌లో గూడఛర్యం కేసులో 1990 అరెస్టయిన సరబ్‌కు లాహోర్, ఫైసలాబాద్‌లలో పేలుళ్లకు పాల్పడిన నేరంపై పాక్ మరణిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.