ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ప్రత్యేక వార్తలు
 
అమెరికా పర్యటనలో మంత్రి జైపాల్‌రెడ్డి
ప్రజాస్వామ్యయుతంగా వేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల కంటే ఉన్నతమైనదనీ కేంద్ర పట్టణాభివృద్ధి వాఖ మంత్రి జైపాల్‌ర్డెడి వ్యాఖ్యానించారు. ప్రగతి పథంలో ఎన్ని అవాంతరాలెదురైనా భారతదేశం ప్రజాస్వామ్య పరిరక్షణను వదులుకోబోదేని ఆయన అన్నారు. వాషింగ్టన్‌, న్యూజెర్సీల్లో ఇటీవల ప్రవాస తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ప్రపంచంలో పట్ణణాభివృద్ధి అత్యంత కీలకమైందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాల స్థాయిలో సమన్వయం లేకపోవడమే పట్టణాభివృద్ధి అంతగా జరగపోవడానికి కారణమని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం కృషి చేస్తుందని జైపాల్‌రెడ్డి అన్నారు. వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాల్లో భారతదేశం సమస్యలన్నీ అధిగమించి అగ్రదేశాల సరసన చేరుతుందనే ఆశాభావాన్ని మంత్రి జైపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని
తానా మహాసభలకు రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు
చికాగో సాహితీ సదస్సులో ప్రసంగించిన మేడసాని
షార్జాలో రెండు కంపెనీల మూత : కష్టాల్లో భారత కార్మికులు
ముంబై-షార్జాల మధ్య ఎయిర్‌ అరేబియా ఛార్జీల తగ్గింపు
ఆటా దసరా సంబరాల్లో అలీ కామెడీ
ప్రవాస భారతీయ భక్తురాలిపై సెల్లార్‌ సిబ్బంది నిర్లక్ష్యం