ప్రవాసాంధ్రుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలను తెలుసుకునేందుకు, వారిని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేందుకు వీలుగా ఈ వెబ్‌సైట్ పని చేస్తుందని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి.
nritdp.com పేరుతో ప్రారంభించిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారానే ఎన్నారైల సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడుతామని చంద్రబాబు ఈసందర్భంగా చెప్పారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్టు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.
|