ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ప్రత్యేక వార్తలు
 
డల్లాస్‌లో ఘనంగా మేడసాని అష్టావధానం
అమెరికాలోని డల్లాస్‌లో నివశిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (టాన్‌టెక్స్), డీఎఫ్‌డబ్ల్యూ హిందూ దేవాలయం ఆధ్వర్యంలో డాక్టర్ మేడసాని మోహన్ అష్టావధాన కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. పంచ సహస్రావధానం పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది తెలుగు సాహితీ ప్రియులు, పలువురు భాషా అభిమానులు పాల్గొని అష్టావధాన్ని విజయవంతం చేశారు.

ఈ అష్టావధాన కార్యక్రమానికి డెంటన్‌లోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పుదూర్ జగదీశ్వరన్ సంధాతగా వ్యవహరించారు. తొలుత అష్టావధాని మేడసానిని పృచ్ఛకులకు పరిచయం చేశారు. పృచ్ఛకులు వివిధ రకాల సాహితీ పద్యాలతో తమ ప్రశ్నలను సంధించగా, వాటికి ధీటుగా మేడసాని సమాధానాలు ఇచ్చారు.

తొలుత నిషిద్దాక్షరి, పురాణ పఠనం, సమస్యా పూరణం, ఘంటాగననమం, అప్రస్తుత ప్రసంగం, దిట్టపది, ఆసువు, న్యస్తాక్షరిలలో అష్టావధానం జరిగింది. ప్రశ్నలను సంధించేందుకు నియమించిన పృచ్ఛకులు ఆయా రంగాల్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన వారు కావడం గమనార్హం.
1| 2
మరిన్ని
ఎన్నారైల కోసం తెదేపా వెబ్‌సైట్
అమెరికా పర్యటనలో మంత్రి జైపాల్‌రెడ్డి
తానా మహాసభలకు రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు
చికాగో సాహితీ సదస్సులో ప్రసంగించిన మేడసాని
షార్జాలో రెండు కంపెనీల మూత : కష్టాల్లో భారత కార్మికులు
ముంబై-షార్జాల మధ్య ఎయిర్‌ అరేబియా ఛార్జీల తగ్గింపు