ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ప్రత్యేక వార్తలు
 
హ్యూస్టన్‌‌లో తెలుగు వారిని కలవనున్న బాబు
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ప్టారీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్‌ తెలుగు వారితో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దికి ఆయన తలపెట్టిన ప్రణాళికల గురించి ప్రవాస తెలుగువారితో సలహాలు, సంప్రదింపులు జరిపేందుకు చంద్రబాబు అమెరికా వస్తున్నారు.

చంద్రబాబు రాకను పురస్కరించుకుని అమెరికాలోని తెలుగు సంఘాలు తానా, ఆటాలతో పాటు హ్యూస్టన్‌ తెలుగు సాంస్కృతిక సమితి కలసి సంయుక్తంగా జూన్‌ 30న హ్యూస్టన్‌ (టెక్సాస్‌) నగరంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి.

ఈ కార్యక్రమానికి టెక్సాస్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున హ్యూస్టన్‌ నగర మేయర్‌ బిల్‌ వైట్‌, టెక్సాస్‌ కాంగ్రెస్‌ నేత నిక్‌లాప్సన్‌, టెక్సాస్‌ సెనేటర్‌ జాన్‌ కార్ని, భారత రాయబార కార్యాలయ కౌన్సిలర్‌ జనరల్‌ ఎస్‌.ఎం గవాయితో పాటు విద్య వైద్య, వ్యాపార, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలోని ప్రముఖులులు హజరవుతారని తానా, ఆటా, టిసిఎ సంస్థల తరపున తానా ఉత్తరాధ్యక్షులు కాకరాల ప్రభాకర్‌ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని
ప్రవాస భారతీయుడికి ‘బీబీసీ’ పురస్కారం
డల్లాస్‌లో ఘనంగా మేడసాని అష్టావధానం
ఎన్నారైల కోసం తెదేపా వెబ్‌సైట్
అమెరికా పర్యటనలో మంత్రి జైపాల్‌రెడ్డి
తానా మహాసభలకు రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు
చికాగో సాహితీ సదస్సులో ప్రసంగించిన మేడసాని