తానా చరిత్రలో మొట్టమొదటిసారిగా యువత కోసం ప్రత్యేకంగా ‘తానా ఇంటర్‌నేషనల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’ (తానా-ఐఐపి) పేరుతో ఒక అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి ఆగష్టు మూడో తేది వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది.
ఈ సంవత్సరం తానా ఐఐపి కమిటీ కఠినతరమైన నిబంధనల మధ్య దరఖాస్తుల పరిశీలన చేసి ఐదు మంది విద్యార్థులను ఈ ఆధ్యయన కార్యక్రమానికి ఎంపిక చేశారు. రాష్ట్రానికి చెందిన భావనా చిలుకూరి, స్నేహ జాస్తి, ప్రభాత్ ఉప్పలూరి, ప్రత్యూష మిడిదొడ్డి, సరిత గొరిపర్తి తానా ఐఐపి కార్యక్రమానికి ఎంపికయ్యారు.
వీరికి భోజన వసతి, సదుపాయాలతో పాటు స్థానిక రవాణా ఖర్చులను తానా భరిస్తుందని తానా- ఐఐపి అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
|