ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ప్రత్యేక వార్తలు
 
తానా ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించిన అక్కినేని
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేపట్టిన అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సోమవారం ప్రారంభించారు. విదేశాల్లో నివశిస్తున్న తెలుగు ప్రజల పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయం, జీవన శైలిని తెలిపేందుకు వీలుగా. తానా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

విదేశాల్లో పుట్టి పెరిగిన ఐదుగురు విద్యార్థులను అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్ర రాజధానికి పంపింది. వీరు 40 రోజుల పాటు హైదరాబాద్‌లో వుండి తమకు కేటాయించిన వివిధ అంశాలపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్‌కు ఎన్నికైన విద్యార్థులు అధ్యయనం కంటే.. ఇక్కడి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడమే అతి ముఖ్యమన్నారు.
మరిన్ని
తానా-ఐఐపి'కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
హ్యూస్టన్‌‌లో తెలుగు వారిని కలవనున్న బాబు
ప్రవాస భారతీయుడికి ‘బీబీసీ’ పురస్కారం
డల్లాస్‌లో ఘనంగా మేడసాని అష్టావధానం
ఎన్నారైల కోసం తెదేపా వెబ్‌సైట్
అమెరికా పర్యటనలో మంత్రి జైపాల్‌రెడ్డి