ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ప్రత్యేక వార్తలు
 
అమెరికాలో యువతను ఆకట్టుకున్న చంద్రబాబు
అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్కడ నివశిస్తున్న తెలుగు యువతు ఎంతగానే ఆకట్టుకున్నారు. సమాజంలో ధనిక వర్గాలకు, పేద వర్గాలకు మధ్యగల అంతరాన్ని తొలగించడానికి కృషి చేయాలన్నదే తన జీవిత పరమావధిగా మంగళవారం రాత్రి లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.

తమ అమెరికా పర్యటన రాజకీయాలకు దూరం అని ముందుగానే ప్రకటిస్తూ ప్రవాసాంధ్రులు అందరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని మాతృభూమి ప్రగతి కోసం వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. వివాదాస్పదమైన అంశాల చర్చకు ఇది వేదిక కాదంటూ అందరూ సేవాభావాన్ని పెంచుకుని జాతి ప్రగతికి కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కివక్కాణించారు.

ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ట్రస్టు సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నదే తమ ఆకాంక్షగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రవాసాంధ్రులు అంతా పూనుకుంటే అసలు రాష్ట్రంలో దారిద్ర్యం అనేదే ఉండదని ఆయన వ్యాఖ్యానించినప్పుడు యువకులు కరతాళ ధ్వనులు చేశారు.
మరిన్ని
తానా ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించిన అక్కినేని
తానా-ఐఐపి'కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
హ్యూస్టన్‌‌లో తెలుగు వారిని కలవనున్న బాబు
ప్రవాస భారతీయుడికి ‘బీబీసీ’ పురస్కారం
డల్లాస్‌లో ఘనంగా మేడసాని అష్టావధానం
ఎన్నారైల కోసం తెదేపా వెబ్‌సైట్