అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జూలై ఐదవ తేదీన వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభంకానున్న 16వ తానా మహాసభలకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు భార్య హిల్లరీ క్లింటన్ కూడా హాజరుకానున్నారు. క్లింటన్ కార్యాలయం నుంచి తానా అధ్యక్షునికి ఈమేరకు అధికార సమాచారం అందింది.
ఇప్పటివరకూ ప్రవాసాంధ్రుల సభలు ఎన్నో జరిగినా ఒక మాజీ అధ్యక్షుని స్థాయి నాయకుడు ఇటువంటి సభలకు హాజరు కావడం ఇదే మొదటిసారి. క్లింటన్ రాకతో ప్రవాస తెలుగువారిలో ఎంతో ఉత్సాహం కనిపిస్తున్నది. క్లింటన్, హిల్లరీ రావడంవల్ల తప్పకుండా ప్రవాస తెలుగువారికి మంచి జరుగుతుందన్న నమ్మకం చాలా మందికి ఉందని తానా ప్రతినిధులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
|