ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ప్రత్యేక వార్తలు
 
అగ్రదేశం పీఠంపై తెలుగు వ్యక్తి చోటు
అగ్రదేశం అమెరికా అధ్యక్ష పీఠంపై తెలుగువ్యక్తిని కూర్చోబెట్టేందుకు ఇప్పటి నుంచే కృషి చేద్దామని తానా వ్యవస్థాపకుల్లో ఒకరైన రంగనాథ బాబు పిలుపునిచ్చారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా తానా సమావేశాలకు వచ్చే అమెరికన్లు.. అమెరికా రాజకీయాల్లోకి ఎందుకు పాలుపంచుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కేవలం నాలుగు శాతం ఉన్న జాయిష్ అమెరికన్లు అగ్రదేశాన్ని ఏలుతున్నారు. అయితే.. అర్థికపరంగా వారిని మించి పోయిన తెలుగువారు భవిష్యత్‌లో అగ్రదేశంలో రాజకీయ అధికారాన్ని చెలాయించే స్థాయికి చేరుకునేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని రంగనాథబాబు కోరారు.

తమ లక్ష్య సాధనలో భాగంగా.. ఈనెల 16వ తేదీన ప్రారంభంకానున్న తానా మహాసభలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్‌లను తీసుకొస్తున్నామని ఆయన వివరించారు.
మరిన్ని
తానా మహాసభలకు రానున్న క్లింటన్ దంపతులు
అమెరికాలో యువతను ఆకట్టుకున్న చంద్రబాబు
తానా ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించిన అక్కినేని
తానా-ఐఐపి'కు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
హ్యూస్టన్‌‌లో తెలుగు వారిని కలవనున్న బాబు
ప్రవాస భారతీయుడికి ‘బీబీసీ’ పురస్కారం