ప్రధాన పేజి   ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు
 
వచ్చే నెల 16న 'టాన్‌టెక్స్' తెలుగు సాహిత్య వేదిక సమావేశం
WD PhotoWD
ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలోని తెలుగు సాహిత్య ఫోరం నిర్వహించే 'తెలుగు సాహిత్య వేదిక' రెండో సమావేశం వచ్చే నెల 16వ తేదీన జరుగనుంది. తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ తెలుగు సాహిత్య వేదిక తొలి సమావేశం ఈనెల 19వ తేదీన ఇర్విన్‌లోని ఇండ్యాఫూషన్ రెస్టారెంట్‌లో జరిగింది. ఈ తెలుగు ఫోరాన్ని గత 2007 జులై నెల 21వ తేదీన ప్రముఖ సినీ రచయితి, పాత్రికేయుడు, నటుడు గొల్లపూడి మారుతీరావు, హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆవుల మంజులతలు ప్రారంభించారు.

ఈ ఫోరం ప్రతి నెలలో మూడో ఆదివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే సమావేశం సెప్టెంబరు 16వ తేదీన ఇర్విన్‌లోని అవర్ ప్లేస్ రెస్టారెంట్‌లో జరుగుతుందని ప్రసాద్ తోటకూర విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి దేశీయ, అంతర్జాతీయ సాహిత్య ప్రియులను ఆహ్వానించి, వారి అనుభవాలను తెలుసుకుంటారని, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు కూడా తమ సాహిత్య పరిజ్ఞాన్ని పంచుకుంటారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేవలం సాహితీ రంగానికి చెందిన అంశాలే కాకుండా.. తమ దైనందిన సమస్యలను కూడా చర్చిస్తారని ప్రసాద్ తోటకూర వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ఆహుతులు తెలుగు సాహితీ ఫోరానికి తమవంతు ఆర్థిక సాయం చేశారు. అనంతరం ప్రసాద్ తోటకూర వందనసమర్పణంతో ఈ కార్యక్రమం ముగిసింది.
మరిన్ని
ముగిసిన తానా 'ఐఐపీ ప్రోగ్రామ్-2007'
రేపు టొరాంటోలో హిందూ దేవాలయం ప్రారంభం
డాక్టర్ కట్టమంచికి తానా అభినందన అవార్డు
అగ్రదేశం పీఠంపై తెలుగు వ్యక్తి చోటు
తానా మహాసభలకు రానున్న క్లింటన్ దంపతులు
అమెరికాలో యువతను ఆకట్టుకున్న చంద్రబాబు