అమెకాలోని ప్రతిష్టాత్మకమైన ఐదు విశ్వవిద్యాలయాల్లో ఆస్టిన్ టెక్సాస్ విశ్వవిద్యాలయం ఒకటి. ఇక్కడ ఈ ఏడాది సెప్టెంబరు నుచి తెలుగు భాషా బోధన ఆరంభమైంది. తానా చొరవ, ఆర్థిక సహకారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తొలి ఏడాదే మంచి స్పందన కనిపించింది. ఇప్పటికే.. దక్షిణాది భాషలైన తమిళం, మలయాళం వంటి భాషల బోధన జరుగుతున్న ఈ వర్శిటీలో తెలుగు భాష కూడా ఉండి తీరాలన్న పట్టుదలతో తానా చొరవ తీసుకుని, నిధుల సేకరణకు నడుంబిగించింది. అతి తక్కువ కాలంలోనే తగినన్ని నిధులు సేకరించి, తెలుగు భాషా బోధనను చేపట్టింది.
తొలి సెమిస్టార్‌లో 16 మంది విద్యార్థినీ విద్యార్థులు చేరి, తెలుగు అభ్యసించారు. ఇప్పటి వరకు ఆ సంఖ్య హిందీ, ఉర్ధూ భాషలకు మాత్రమే ఉండేది. దీనిపై విశ్వవిద్యాలయ ఆసియా అధ్యయన విభాగం జరిపిన ఒక సర్వేలో కూడా విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. తెలుగు భాష నేర్చుకునే అవకాశం కల్పించినందుకు వర్శిటీ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంతమంది విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేందుకు చేరడం శుభపరిణామని ఆసియా అధ్యయన విభాగం ఛైర్మన్ ప్రొఫెసర్ జోల్ బ్రెర్టన్ అన్నారు. ప్రతి ఏడాది తగినంత మంది విద్యార్థులు వుంటే వేసవిలో ఎనిమిది వారాల పాటు తెలుగు కోర్సును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు.
|