ప్రధాన పేజి   ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు
 
అట్లాంటాలో ఘంటసాల ఆరాధనోత్సవాలు
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో అలనాటి నేపథ్య గాయకుడు ఘంటసాల ఆరాధనోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సుమధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 85 జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఆరాధనోత్సవాలు స్థానిక హిందూ దేవాలయ ఆడిటోరియంలో ఆరంభమయ్యాయి. సుమారు 30 నగరాల్లో నిర్వహించే ఈ ఆరాధనోత్సవాలకు హైదరాబాద్‌ నుండి విచ్చేసిన గాయక శిరోమణి జి.వి.ప్రభాకర్‌, హోస్టన్‌కు చెందిన గాయక రత్న మణి శాస్త్రి ప్రధాన గాయకులుగా వ్యవహరిస్తారు.

ప్రాథమిక దశలో గెలుపొందిన గాయకులకు డిసెంబర్‌ రెండో తేదీన న్యూయార్క్‌లో గ్రాండ్‌ ఫైనల్‌ నిర్వహిస్తారు. ఘంటసాల ఆరాధనోత్సవాలను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ నిర్విహిస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెల్స్‌, డెన్వర్‌, చికాగో, న్యూజెర్సి, న్యూయార్క్‌ వంటి తదితర నగరాలలో ఘంటసాల ఆరాధనోత్సవాలు సమారు మూడు నెలల పాటు జరుగుతాయని వంగారు చిట్టెన్న రాజు తెలిపారు.

అట్లాంటాలో ప్రారంభమైన ఆరాధనోత్సవాలు గంటసాల 85వ జన్మదినమైన డిశంబర్‌ 4వ తేదీన ముగుస్తాయని చెప్పారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, సంస్కృతిని చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాలు నివహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
మరిన్ని
డల్లాస్‌లో తెలంగాణా విమోచన దినోత్సవం
ఆస్టిన్‌లో "తెలుగు వెలుగులు"
పేద విద్యార్థుల సేవలో తానా
వచ్చే నెల 16న 'టాన్‌టెక్స్' తెలుగు సాహిత్య వేదిక సమావేశం
ముగిసిన తానా 'ఐఐపీ ప్రోగ్రామ్-2007'
రేపు టొరాంటోలో హిందూ దేవాలయం ప్రారంభం