ప్రధాన పేజి   ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు
 
టెక్సాస్‌లో ఘనంగా దీపావళి సంబరాలు
FileFILE
తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (టాంటెక్స్) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బెల్‌ హైస్కూలు ప్రాంగణంలో ఈ సంబరాలు జరిగాయి. దాదాపు 800ల మంది ప్రవాస తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భగ్గవదీతలోని కధామృత సారమైన 'నరకాసురవధ'ని మూర్తి బద్రిరాజు గానం చేయడంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

శ్రీలతా సూరి నేతృత్వంలోని బందం ‘కృష్ణం వందే జగద్గురమ్ అనే గీతానికి కూచిపూడి నత్యాభినయం చేసి ఆహూతులను అలరింపజేశారు. నాగలక్ష్మి సూరిబొట్ల రచించి దర్శకత్వం వహించిన ‘కుర్రోకుర్రు‘ అనే నృత్యాన్ని అన్నపూర్ణ చిలుకూరి, శారదా జొన్నలగడ్డ అద్భుతంగా అభినయించారు. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన దీపావళి ధమాకా అందరినీ అలరించింది.

డాక్టర్‌ కస్తూరి ఇనగంటి, డాక్టర్‌ కిరణ్‌ కంచర్ల, రాజేష్‌ చిలుకూరి అభినయ ఫ్యాషన్‌ షో ఈ కార్యక్రామనికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో 83 మంది చిన్నారులు పాల్గొనడం విశేషం. ఈ దీపావళి సంబరాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన బెల్‌ స్కూలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బున్జీర్‌ అమెరికా-భారత్‌ సంబంధాలను కొనియాడారు.

బెల్‌ స్కూలులో హిందీ భాషా బోధన ప్రవేశపెట్టినందుకు ప్రసాద్‌ తోటకూర బున్జీర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు ప్రభాకర్‌ చౌదరి కాకరాల, మల్లికార్జునరావు చలసాని, దిలీప్‌ కూచిపూడి, రామ్‌ యలమంచిలి పాల్గొని స్వరాష్ట్రంలోని పేదరోగులకు మెరుగైన వైద్య సేవల అందించేందుకు వీలుగా.. ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆహుతులను కోరారు.
మరిన్ని
ప్రవాసాంధ్రులు ఐక్యంగా ఉండాలి: కోడెల
'ఆసియన్ ఆఫ్ ది ఇయర్-2007'గా డాక్టర్ లార్డ్ హమీద్
సాహితీకారులు సత్కారంలో టాన్‌టెక్స్
లాస్‌ఏంజెల్స్‌లో ఆకట్టుకున్న ఆనందలహరి
ఘంటసాల స్వరార్చన సాగిస్తున్న వేగేస్న ఫౌండేషన్
మలేషియాలో భారతీయులకు చిత్రహింసలు