ఆర్కటిక్ ప్రాంతాన్ని అధ్యయనం చేసేందుకు వెళ్తున్న అంతర్జాతీయ బృందంలో భారత్‌కు చెందిన ఇద్దరు విద్యార్థలకు (చెన్నైకి చెందిన కేఎన్ శ్రుతి, లక్నో విద్యార్థి ఎస్ ధ్రువ) చోటు దక్కింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో వీరికి గతంలో ఇండియన్ క్లైమెట్ ఛాంపియన్ అవార్డు లభించింది.
కేప్ ఫేర్‌వెల్ యూత్ ఎక్స్‌పెడిషన్-2008 పేరుతో జరిగే ఈ యాత్రలో ప్రముఖ శాస్త్రజ్ఞులతో పాటు ప్రపంచ దేశాల నుంచి హైస్కూలు విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. ఈ యాత్రలో పాల్గొనేందు కోసం బ్రిటీష్ కౌన్సెల్ నిర్వహించిన ప్రత్యేక పరీక్షల్లో వీరు ఉత్తీర్ణత సాధించారు.
ముందుగా వీరు ఆగస్ట్ 30వ తేదీన కెనడా బయలుదేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 7న ఎం.వి.అకాడెమిక్ షోకాల్ స్కియ్ పరిశోధక నౌకలో ఆర్కటిక్ యాత్రకు బయల్దేరనున్నారు.
|