ఖతార్‌లో పని చేస్తున్న సుమారు 100 మంది ప్రవాస భారతీయులను తమ స్వదేశానికి పంపేందుకు ఆ దేశంలోని ప్రముఖ సంస్థ సన్నాహాలు చేస్తోందని గల్ఫ్ న్యూస్ వార్తాపత్రిక వెల్లడించింది.
ఈ 100 మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థ ఓ ముఖ్య కాంట్రాక్టును కోల్పోయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆ వార్తా పత్రిక ప్రచురించింది. తమకు సరిగ్గా వేతనాలు చెల్లించడంలేదని, పని వేళల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆ సంస్థలోని కార్మికులు ఆరోపించినట్టు ఆ పత్రిక వెల్లడించింది.
సుమారు 107 మంది పనిచేస్తుండగా, వీరిలో 40 మందిని తొలుత తమ స్వదేశానికి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపినట్టు ఆ పత్రిక పేర్కొంది. తర్వాతి వారంలో మిగిలిన వారిని పంపే అవకాశాలు ఉన్నాయని ఆ అధికారి చెప్పినట్టుగా ఆ పత్రిక వెల్లడించింది.
|