ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ మాసం. ఈ మాసం సోమవారం నుంచి గల్ఫ్, సౌదీ అరేబియా దేశాల్లో ప్రారంభం కానుంది. ఆకాశంలో కనిపించే నెలవంకను బట్టి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది.
కాగా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్ తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి నెలవంక కనిపించలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆదివారాన్ని షబన్ చివరి రోజుగా ప్రకటించారని అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి కనిపించనున్న నెలవంకతో రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
|