ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే
భారతీయ సాంప్రదాయ చిహ్నాలపై దేశవిదేశాల్లో నిషేధం విధించినా... మన మహిళ మాత్రం తన హక్కు కోసం పోరాడి విజయాలు సాధిస్తూనే ఉంది. నుదుటన సింధూరం పెట్టుకోకూడదని దక్షిణాఫ్రికాలో ఇటీవల నిషేధం విధించారు.

భారతీయ మహిళలు సాంప్రదాయ చిహ్నాలు ధరించరాదని స్థానిక అడింగ్టన్ హాస్పిటల్ తమ నర్సులపై విధించిన ఈ నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. క్వజులు నాటల్ ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి పెగ్గీ కోన్‌యెనీ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాలోని భారత నర్సులు బొట్టు, ముక్కుపుడక, మంగళసూత్రాలను ధరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు.

ఇక్కడి వారు తమ వివాహ ఉంగరాలను ఎంత పవిత్రంగా భావిస్తారో, అలాగే భారతీయ మహిళలు తమ మంగళసూత్రాలు, సింధూరాలను భావిస్తారని చెప్పారు. వాటిపై తమకు అత్యంత గౌరవముందని తెలిపారు.
మరిన్ని
టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంగీత విభావరి
గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలు
గల్ఫ్‌లో నేటి నుంచి రంజాన్ మాసం
మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు
స్వదేశానికి తిరిగి రానున్న ఖతార్‌‌లోని భారతీయులు
ఒరిస్సాలో హింసపై ప్రవాస భారతీయుల నిరసన