ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > వరుసగా రెండోసారీ ఐరాస పదవిలో పచౌరి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వరుసగా రెండోసారీ ఐరాస పదవిలో పచౌరి
భారత్‌కు చెందిన రాజేంద్ర కుమార్ పచౌరీ వరుసగా రెండో సారి ఐరాస పదవికి ఎంపికయ్యారు. ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (ఐపీసీసీ)కి ఆయన ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

జెనీవాలో జరిగిన ఐపీసీసీ ప్లీనరీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ది ఎనర్జీ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్(టీఈఆర్ఐ)కి పచౌరీ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నారు. 2002లోనే పచౌరీ ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు.

గత ఏడాది అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఆల్ గోరెతో కలసి ఐపీసీసీ సంస్థ నోబెల్ శాంతి బహుమతి సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ఛైర్మన్ పదవిని మళ్లీ పచౌరీనే స్వీకరించనున్నారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
మరిన్ని
నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే
టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంగీత విభావరి
గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలు
గల్ఫ్‌లో నేటి నుంచి రంజాన్ మాసం
మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు
స్వదేశానికి తిరిగి రానున్న ఖతార్‌‌లోని భారతీయులు