ఆస్ట్రేలియాకు చదువుకునేందుకు వెళ్లే భారతీయ విద్యార్థులకు ఇక వీసాలు లభించడం కష్టమే. ఆస్ట్రేలియాకు వచ్చే ప్రవాస విద్యార్థులతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వారి వీసాల మంజూరుపై ఆస్ట్రేలియా కఠినమైన నిబంధనలను విధించింది.
భారత్ సహా మరో తొమ్మిది దేశాలతో ఓ ప్రమాదకర దేశాల జాబితాను ఆస్ట్రేలియా తయారు చేసింది. ఈ జాబితాలో కొలంబియా, ఈజిప్ట్, ఘనా, జోర్డాన్, నైజీరియా, శ్రీలంక, రుమేనియా, జింబాబ్వేలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులు వీసాల కోసం కఠినమైన నిబంధనలను ఎదుర్కోవలసి ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ సిటిజెన్‌షిప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
విద్యార్థులు తాము నిజంగా చదువుకోసమే ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు తగిన రుజువులు, రికార్డులు చూపాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిబంధనల్లో మార్పు కారణంగా విద్యార్థులు భయపడలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
|