ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > దుబాయ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దుబాయ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం
దుబాయ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా అర్హులైన వారికి మరింత సాయం చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అలాగే మృతుల కుటుంబంలోని అర్హులైన వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు, వ్యవసాయం కోసం కొంత భూమి, పెన్షన్లను పంపిణీ చేయనున్నామని ఆ వర్గాలు తెలిపాయి.

ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకరు మినహా మిగిలిన వారు కరీంనగర్ జిల్లాకు చెందిన వారేనని అధికార వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
ఫ్రిస్కోలో తానా, టాన్‌టెక్స్‌ల సంగీత కార్యక్రమం
ఆరు రోజుల్లోనే అమెరికా వీసాలు: కాన్సులెట్ జనరల్
అస్ట్రేలియా వీసా నిబంధనలు మరింత కఠినతరం
వరుసగా రెండోసారీ ఐరాస పదవిలో పచౌరి
నర్సుల నొసటన సింధూరం: దక్షిణాఫ్రికా ఓకే
టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంగీత విభావరి