ప్యారిస్‌లో ఈవారం ప్రారంభం కానున్న సంప్రదాయ పెళ్లి వస్త్రాల డిజైనింగ్ ఫెయిర్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు యువ ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్యారిస్‌లో పలు రకాల డిజైన్లను ప్రదర్శించనున్నారు.
జైపూర్‌కు చెందిన ఆయుష్ కస్లీవాల్, అహ్మదాబాద్‌కు చెందిన వర్ష శర్మ, పునీత్ బ్రార్, ఢిల్లీకి చెందిన కపిల్ మాథూర్, శిల్పా బుద్ధి రాజా, గుజాన్ గుప్తా, పశ్చిమ గుజరాత్‌కు చెందిన జిజిషా పటేల్ తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బును సమాజ సేవ కోసం ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.
|