పని పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా ఖతార్‌లోని 10 మంది భారత కార్మికులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వీరికి అక్కడి భారత దౌత్యకార్యాలయం సాయం అందిస్తోందని గల్ఫ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ఓ మానవవనరుల సంస్థలో పనివాతావరణం సరిగ్గా లేదని పది మంది కార్మికులు భారత దౌత్యకార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలో మొత్తం 100 కార్మికుల దాకా పనిచేస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. ఇందులో చాలా వరకు కేరళకు చెందిన వారేనని ఆ పత్రిక పేర్కొంది.
ఈ ఫిర్యాదు ఆధారంగా దౌత్యకార్యాలయం ఆ సంస్థకు చెందిన మెనేజర్‌తో చర్చలు జరుపగా, వారికి తమ వేతనాలు, భారత్ వెళ్లేందుకు ఛార్జీలను చెల్లిస్తామని తెలిపారని పత్రిక వెల్లడించింది.
|