ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > పోరాడి గెలిచిన విక్రమ్ సింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పోరాడి గెలిచిన విక్రమ్ సింగ్
FILE
ప్రవాస భారతీయుడి సోదరుడైన విక్రమ్ సింగ్ టొరొంటోలో విజిటింగ్ వీసా పొడిగింపుపై పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించాడు. కాగా, విక్రమ్ సోదరుడు సన్‌రైజ్ ప్రోపెన్ ప్లాంట్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ, బ్రమ్టాన్‌లోని షేరిడన్ కళాశాలలో చదువుతున్నాడు. అయితే గత ఆగస్టు 10వ తేదీన ఈ ప్లాంటులో జరిగిన గ్యాస్ విస్ఫోటనంలో అతను మృతి చెందాడు.

సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్ళిన విక్రమ్, సోదరుడి మృతికి కారణమైన కంపెనీ నుండి నష్టపరిహారం పొందటం, భీమా క్లైయిమ్‌ను పొందటం తదితర విషయాల పరిష్కారానికి తన విజిటింగ్ వీసాను పొడిగించాలని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు.

అయితే ఇందుకు నిరాకరించిన టొరంటో ప్రభుత్వం, విక్రమ్ పోరాటంతో కాస్తంత వెనక్కితగ్గి ఆ తరువాత దిగివచ్చింది. విక్రమ్ రెండునెలల విజిటింగ్ వీసాను మరో ఏడాదిపాటు పెంచినట్లు టొరంటో ప్రవాసుల మంత్రిత్వశాఖ ప్రతినిధి జసన్ కెన్ని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"తామా" నూతన కార్యవర్గం ఎంపిక
అక్రమ వలసదారుల్లో భారతీయుడు
అది మా స్వయంకృతం : బాబీ జిందాల్
టొరంటోలో మిన్నంటిన దీపావళి సంబరాలు
మెగాస్టార్ స్ఫూర్తితో "చిరు వారధి పౌండేషన్"
అమెరికాలో "ఆంధ్ర అవతరణ" ఉత్సవాలు