సొంత కుమారులనే హత్య చేసిన భారత సంతతి వ్యక్తి అశోక్ కళ్యాణ్‌జీ (46)కి బ్రిటన్ న్యాయస్థానం 21 ఏళ్ల జైలుశిక్ష విధించింది. గత సంవత్సరం మే నెల, మూడవ తేదీన అశోక్ తన పిల్లలకు బొమ్మలు కొనిపెడతానని ఆశ చూపించి కారులో తీసుకెళ్లాడు.గ్లాస్‌గౌ సమీపంలోని క్యాంప్సీ ఫెల్స్ ప్రాంతంలో ఆరేళ్ల వయస్సున్న పాల్, రెండేళ్ల వయసున్న జేలను... అశోక్ గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత వారిని కారులోనే ఉంచి, తాను కూడా అందులోనే ఉండి నిప్పంటించుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసు విచారించిన పెస్లీ కోర్టు న్యాయమూర్తి లార్డ్ బ్రెయిల్స్ ఫోర్డ్ తీర్పునిస్తూ.. "ఇది ఊహకు అందని దారుణం" అని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే... 1991 సంవత్సరంలోనే లండన్‌లో స్థిరపడ్డ అశోక్ 2001లో స్కాట్లాండ్‌కు చెందిన గిసెల్లీ రాస్‌ను పెళ్లి చేసుకున్నాడు. తరువాత 2004లో వీరిరువురూ విడాకులు తీసుకుని వేరుపడ్డారు. ఒకరోజు పిల్లలతో గడపాలని చెప్పి బయటికి తీసుకెళ్లిన అశోక్ ఈ దారుణానికి ఒడిగట్టిన అమాయకులైన పసిపిల్లల ప్రాణాలను బలిగొన్నాడు. |