ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > ఎన్నారైలను వరించిన "పద్మ" అవార్డులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎన్నారైలను వరించిన "పద్మ" అవార్డులు
FILE
భారతదేశ 60వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "పద్మ" అవార్డుల్లో తొమ్మిదిమంది ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. వారిలో ప్రముఖ మేనేజ్‌మెంట్ గురు సీకే ప్రహ్లాద్, సంఘ సేవకుడు హమీద్, భక్త బీ రథ్, థామస్ కైలాథ్‌లకు పద్మభూషన్ అవార్డులు లభించాయి.

అలాగే... ప్రతాపాదిత్య పాల్, పంచపకేశ జయరామన్, సన్నీ వర్కీ, చెరిల్ కృష్ణ మీనన్, భావగత్ రఘురామ్ శెట్టిలను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కాగా, మేనేజ్‌మెంట్ కన్సల్టెట్‌గా, రచయితగా పేరుపొందిన సీకే ప్రహ్లాద్... మిచిగాన్ యూనివర్సిటీలోని రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో కార్పొరేట్ స్ట్రాటెజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు 2009 సంవత్సరపు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు కూడా లభించింది.

ఇక హమీద్ విషయానికి వస్తే... ఈయన బ్రిటన్ సంస్కృతి, విశ్వాసాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకుగాను వివిధ సామాజిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడమేగాకు, వైద్యుడిగా తన సేవలను అందిస్తున్నారు. ఈయన సేవలకు గుర్తింపుగా 2007వ సంవత్సరంలో "ఫ్రైడ్ ఆఫ్ ఇండియా" అవార్డును అందుకున్నారు.

భక్త బి. రథ్ అమెరికా నావల్ రీసెర్చ్ లేబరేటరీలో అసోసియేట్ డైరెక్టర్‌గా, మెటీరియల్ సైన్స్ డైరెక్టరేట్ విభాగ అధిపతిగా తన సేవలను అందిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా, సమాచార సిద్ధాంతకర్తగా, పారిశ్రామిక వేత్తగా పలు పాత్రలను పోషిస్తున్న థామస్ కైలాథ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంతేగాకుండా, ఈయన లీనియర్ సిస్టమ్స్‌పై పలు రచనలు చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బన్సాల్, కాత్యాల్ ఎంపికపై న్యాయవాదుల హర్షం
జర్మనీ ప్రవాసాంధ్రుల సంక్రాంతి సంబరాలు
26న ఇండో-ఆస్ట్రేలియన్ డే ఉత్సవాలు
లేబర్ పార్టీ కార్యవర్గంలో భారత సంతతి ఎంపీ
పిల్లల హంతక ఎన్నారైకి 21 ఏళ్ల జైలు
బ్రిటన్ వారపత్రిక "ఈస్ట్రన్ ఐ" ఎన్నారై కైవసం