భద్రతా కారణాల దృష్ట్యా... అక్రమ వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా, బ్రిటన్‌లోని భారతీయ రెస్టారెంట్లపై ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేశారు. ఉత్తర ఇంగ్లండ్‌లోని మూడు రెస్టారెంట్లపై దాడులు చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎనిమిదిమంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.గుర్హమ్ నగరంలోని రాజ్‌పుత్ ఇండియన్ రెస్టారెంట్, మే ప్లవర్ చైనీస్ టేకేవే, వాల్‌సెండ్‌లోని గ్రిల్ష్ చిప్ రెస్టారెంట్లపై ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేసిన అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు... బ్రిటన్ బోర్డర్ ఏజెన్సీ (యూకేబీఏ) అధికారులు వెల్లడించారు. కాగా, అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్, చైనా, భారతదేశాలకు చెందినవారు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.సరైన అనుమతి పత్రాలు లేనివారిని పనిలో పెట్టుకున్న రెస్టారెంట్ యజమానులకు ఈ సందర్భంగా ఇమ్మిగ్రేషన్‌వారు 50 వేల పౌండ్ల భారీ జరిమానాలు విధించినట్లు యూకేబీఏ అధికారులు తెలియజేశారు.ఈ సందర్భంగా యూకేబీఏ నార్త్ ఈస్ట్ ఆపరేషన్స్ డైరెక్టర్ స్టీవ్ లాంబ్ మాట్లాడుతూ... తమ దేశంలోకి ప్రవేశించి, సరైన ధృవపత్రాలు లేకుండా ఉద్యోగాలు చేస్తున్న వారిని ఏరివేసేందుకు, అక్రమ వలసలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమే ఈ దాడులని వివరించారు. |