ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > సత్తా ఉన్న పదిమందిలో "బాబీ జిందాల్"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సత్తా ఉన్న పదిమందిలో "బాబీ జిందాల్"
FILE
"ప్రపంచాన్ని మార్చే సత్తా కలిగిన పదిమంది"లో అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు, లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ స్థానం సంపాదించుకున్నాడు. "న్యూస్టేట్‌మన్ అండ్ సొసైటీ" అనే బ్రిటీష్ పత్రిక ప్రకటించిన ఈ జాబితాలో బాబీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

వివిధ ప్రజాస్వామ్య బహుపార్టీల పురోగతికి, మధ్యాసియాలో శాంతి సాధన, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వాలపై ప్రభావం చూపించిన ప్రముఖులు... అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇరాన్ దేశాలలో మార్పు దిశగా కృషి చేసిన, చేయబోతున్న రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకుని ఈ జాబితాను రూపొందించినట్లు న్యూస్టేట్‌మన్ వెల్లడించింది.

రిపబ్లికన్ పార్టీకి పునరుత్తేజం కలిగించినందుకుగానూ బాబీ జిందాల్ ఈ అరుదైన గౌరవం దక్కిందని న్యూస్టేట్‌మన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అమెరికా రాజకీయాలలో బాబీని "రిపబ్లికన్ పార్టీ రక్షకుడ"ని న్యూస్టేట్‌మన్ ఈ సందర్భంగా అభివర్ణించింది.

బాబీతో పాటు భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త రెజినా పాపా కూడా చోటు దక్కించుకోవడం విశేషం. రెజినా పాపా భారత్‌లోని తమిళనాడుకు చెందినవారు. దేశంలోనే మొట్టమొదటిసారి అలగప్ప యూనివర్సిటీలో ఉమన్ స్టడీస్ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించిన ఘనత పాపాకే దక్కుతుంది. కాగా, ప్రస్తుతం ఈమె బంగ్లాదేశ్‌కు చెందిన ఆసియన్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్‌కు సేవలందిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆప్ఘన్ల చెరలోని భారతీయుడు మృతి
స్లమ్‌డాగ్ మిలీయనీర్‌‌కు "బాప్టా" అవార్డులు
అత్యాచార నిందిత కెనడా ఎన్నారైకి బెయిల్
అత్యాచారం కేసులో భారతీయుడి అరెస్ట్
ప్రతిష్టాత్మక "ఇయర్ ఆఫ్ ఇండియా" వాయిదా
భారతీయుల ప్రయోజనాలను పరిరక్షిస్తాం