ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > స్లమ్‌డాగ్ నటుడు ఇర్ఫాన్‌కు బ్రిటీష్ పురస్కారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్లమ్‌డాగ్ నటుడు ఇర్ఫాన్‌కు బ్రిటీష్ పురస్కారం
FILE
స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రంలో తనదైన శైలిలో, అద్భుతమైన హావభావాలను పలికించిన విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ను బ్రిటీష్ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది.

భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకుగానూ ఇర్ఫాన్ ఖాన్ "బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామర్స్" గౌరవాన్ని అందుకున్నారు. ఈ మేరకు బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లేబర్ పార్టీ తరపున బర్మింగ్‌హాం పెర్రి బార్ ఎంపీ ఖాలీద్ మహమ్మద్ చేతులమీదుగా ఇర్ఫాన్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ... అంతర్జాతీయ వేదికలపై తన విజయపరంపరను కొనసాగిస్తున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రంలో నటించినందుకు తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. అలాగే, అవార్డును అందజేసిన బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామర్స్‌కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, స్లమ్‌డాగ్‌లో ఇర్ఫాన్ పోలీసు ఇన్స్‌పెక్టర్ పాత్రను పోషించి, విమర్శకుల ప్రశంలందకున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సత్తా ఉన్న పదిమందిలో "బాబీ జిందాల్"
ఆప్ఘన్ల చెరలోని భారతీయుడు మృతి
స్లమ్‌డాగ్ మిలీయనీర్‌‌కు "బాప్టా" అవార్డులు
అత్యాచార నిందిత కెనడా ఎన్నారైకి బెయిల్
అత్యాచారం కేసులో భారతీయుడి అరెస్ట్
ప్రతిష్టాత్మక "ఇయర్ ఆఫ్ ఇండియా" వాయిదా